టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఈటల విమర్శలు

తెలంగాణలో పండిన పంట కొనలేని పరిస్థితులు దాపురించాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

రైతు వద్ద కొన్న వరి ధాన్యం కోత పేరిట మిల్లర్లు కట్ చేస్తున్నారని విమర్శించారు.

ఐకేపీ సెంటర్లు తెరిచినా కల్లాల వద్ద తక్కువ ధరకే అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల యూటిలైజేషన్ సర్టిఫికెట్ కేంద్రానికి పంపడం లేదని మండిపడ్డారు.

కేసీఆర్ కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకొని ప్రధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.రైతులకు సకాలంలో ఎరువులు అందజేయాలని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు