మిస్టర్ బచ్చన్ - డబుల్ ఇస్మార్ట్: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్.. నెగ్గేదెవరు..??

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ( Ravi Teja ) 2024, ఆగస్టు 15వ తేదీన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

హరీష్ శంకర్ ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమాని డైరెక్ట్ చేశాడు.

ఇందులో రవితేజ టైటిల్ రోల్‌లో నటించగా, భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా చేసింది.జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించారు.

ఇది 2018లో వచ్చిన హిందీ స్లీపర్ హిట్ అయిన రైడ్‌కు అఫీషియల్ తెలుగు రీమేక్.రియల్ లైఫ్‌లో భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై జరిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ సినిమాని తీశారు.

ఈ మూవీ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేపింది.కథ ఎలా ఉంటుంది, రవితేజ ఎలా నటించాడు, హరీష్ శంకర్ ( Harish Shankar )డైరెక్షన్ ఎలా ఉంది, ఈ సినిమాతో ఈ హీరో భారీ హిట్ కొడతాడా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Mistar Bacchan Vs Double Ismart ,mr Bachchan , Clash , Ram, Ravi Teja, Tollyw
Advertisement
Mistar Bacchan Vs Double Ismart ,Mr Bachchan , Clash , Ram, Ravi Teja, Tollyw

అయితే రవితేజని బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడానికి రామ్ పోతినేని రెడీ అయ్యాడు.అతను తన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆగస్టు 15వ తేదీన బరిలోకి దిగనున్నాడు.పూరి జగన్నాథ్ (Puri Jagannadh )డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్.

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్‌ కలిసి నిర్మించారు.ఇందులో బిగ్ బుల్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు.దాంతో ఈ మూవీపై చాలా అంచనాలు పెరిగిపోయాయి.

ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ కాబట్టి దీన్ని చూడాలని చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.33 కోట్లకు కొనుగోలు చేసింది.అంత డబ్బుకు కొనుగోలు చేసిందంటే మూవీ బాగానే ఉండి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తున్నారు.

ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు కాబట్టి పాటలు కూడా బాగానే ఉంటాయి.

Mistar Bacchan Vs Double Ismart ,mr Bachchan , Clash , Ram, Ravi Teja, Tollyw
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

మిస్టర్ బచ్చన్ సినిమా( Mr Bachchan ) అనేది ఒక రీమేక్ కాబట్టి అది విడుదల అయ్యి, ఫస్ట్ డే టాక్ బయటకు వచ్చేదాకా అది హిట్ అవుతుందని చెప్పలేం.దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.ఇది కూడా రీమేకే.

Advertisement

అందువల్ల మిస్టర్ బచ్చన్ హిట్ అవుతుందని ఒక నమ్మకం అయితే పెట్టుకోవచ్చు.హరీష్ శంకర్ దగ్గరే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓనమాలు దిద్దాడు.

ఇప్పుడు గురు శిష్యులు ఏమాత్రం తగ్గకుండా తమ సినిమాలను ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా వైడ్ గా విడుదల అవుతుంది కావున దీనికి ఎక్కువగానే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.రవితేజ సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ కానుంది.

కాబట్టి పాన్ ఇండియా సినిమాతో పోటీగా అది కలెక్షన్లను రాబట్టకపోవచ్చు.ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడానికి ఇంకా పది రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.ఈసారి బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న ఈ రెండు సినిమాలలో నెగ్గేది ఎవరనేది ఇప్పటికిప్పుడే తెలియదు.

ఎవరికి వారు సొంత స్ట్రాటజీలు ఫాలో అయితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి.

తాజా వార్తలు