వైరల్: కుక్క పంచాయతీతో పిచ్చెక్కిందట

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక తప్పిపోయిన కుక్క కేసు పోలీసులకు చుక్కలు చూపించిందట.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఉద్దాంసింగ్ నగర్‌ జిల్లాలో ఓ వ్యక్తికి రోడ్డు పక్కన ఓ కుక్క దొరికింది.దానిని తనవెంట ఇంటికి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి.

కాగా తనకో కుక్క దొరికిందని, దాని యజమాని ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలంటూ తన చిరునామాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.కాగా అతడికి మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి అది తన కుక్కే అని చెప్పాడు.

దీంతో ఆ యజమానిని వచ్చి కుక్కను తీసుకుపోవాల్సిందిగా సదరు వ్యక్తి తెలిపాడు.కాగా మరో వ్యక్తి కూడా ఫోన్ చేసి అది తన కుక్క అని, తనే ఆ కుక్కకు యజమానినంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

దీంతో ఆ కుక్క అసలు యజమాని ఎవరో తేల్చాసిందిగా దాన్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు ఆ కుక్క దొరికిన వ్యక్తి.అటుపై పోలీసులు ఫోన్ చేసిన ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మని అన్నారు.

వారు చెప్పిన ఆనవాల్లు ఒకేలా ఉండటంతో ఆ కుక్క ఎవరిదో తేల్చడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.దీంతో ఆ కుక్కను ఒక రోజు పోలీస్ స్టేషన్‌లోనే పెట్టారట.

కాగా వారిద్దరిలో ఒకరు యజమానిగా మరొకరిని ఒప్పించడంతో ఆ కుక్కను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది.ఏదేమైనా ఒక కుక్క కూడా పోలీసులకు పిచ్చెక్కించడం నిజంగా విడ్డూరం అంటున్నారు ఈ విషయం తెలుసుకున్నవారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు