వికారాబాద్ జిల్లా సుల్తాన్ పూర్ లో తప్పిన పెను ప్రమాదం

వికారాబాద్ జిల్లాలోని సుల్తాన్ పూర్ లో పెను ప్రమాదం తప్పింది.స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది.

వెంటనే గమనించిన స్థానికులు విద్యార్థులను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు.అయితే బస్సు స్టీరింగ్ పని చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు.

మరోవైపు స్కూల్ యాజమాన్యాలు ఫిట్ నెస్ బస్సులను నడుపుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement