Miss Shetty Mister Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రివ్యూ అండ్ రేటింగ్!

బాహుబలి తర్వాత చాలా సంవత్సరాలకు అనుష్క(అనుష్కే) నవీన్ పోలీస్ శెట్టి( Naveen Polishetty ) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mister Polishetty ).

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహేష్ బాబు పి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:

ఇందులో అనుష్క అన్విత అనే చెఫ్ పాత్రలో నటిస్తారు.ఇందులో అనుష్క తల్లి చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉండిపోతారు.

ఇలా ఒంటరిగా ఉన్నటువంటి అన్వితకు ఒక బేబీ తోడు కావాలని కోరుకుంటుంది అయితే పెళ్లి కాకుండా తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా బేబీ కావాలి అనుకున్నటువంటి అన్వితకు స్టాండప్ కామెడీ చేసే హీరో నవీన్ పోలిశెట్టి పరిచయమవుతారు.ఇలా హీరో పరిచయమైన తర్వాత కథ ఏ మలుపు తిరిగింది ఆమె పెళ్లి కాకుండానే బేబీని సొంతం చేసుకున్నారా అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ తదుపరి సీన్ ఏమొస్తుందా అన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

నటీనటులు:

నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో కామెడీతో అందరిని నవ్వించారు అనుష్క తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది.ఇతర నటీనటులు కూడా వారి పాత్రలలో ఒదిగిపోయినటించారు.

టెక్నీషియన్స్:

డైరెక్టర్ మహేష్ బాబు( Director Mahesh Babu ) ఎంతో అద్భుతంగా స్క్రీన్ ప్లే ని చూపించారు.ఇక మ్యూజిక్ యావరేజ్ గానే అనిపించింది.

ఎడిటింగ్ స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉన్నప్పటికీ పెద్దగా బోర్ కొట్టే సన్నివేశాలు అయితే లేవు.ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది…

ప్లస్ పాయింట్స్:

మంచి కామెడీ సీన్స్ తో మెప్పిస్తూ పెద్దగా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంది నవీన్ కామెడీ చాలా ప్లస్ పాయింట్ గా నిలిచింది.ఇక అనుష్క నటన కూడా సినిమాకు హైలైట్ అని చెప్పాలి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

మైనస్ పాయింట్స్:

కథ రొటీన్ గానే అనిపించింది, మ్యూజిక్ కాస్త యావరేజ్ గానే ఉంది, మెలోడ్రామా కొంచం కనెక్ట్ అవ్వలేదు.

Advertisement

బాటమ్ లైన్:

పార్టు పార్టులుగా సినిమా టైం పాస్ సీన్స్ తో నిండిపోవడంతో అక్కడక్కడా కొన్ని ఫ్లాస్ అండ్ బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమాని ఒకసారి చూసి మాత్రం ఎంజాయ్ చేయవచ్చని చెప్పాలి.

రేటింగ్ 2.5/5

తాజా వార్తలు