వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్మల రామానాయుడు( Nimmala Rama Naidu ) భీమవరంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ( Volunteer system )ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు.వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్నట్లు తెలిపారు.

త్వరలోనే ఈ వ్యవస్థ పై సమీక్ష నిర్వహించి వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటామని వెల్లడించారు.ఇంటి వద్దే పింఛన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మెగా డీఎస్సీ( Mega DSC )పై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని గుర్తు చేశారు.

Advertisement

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భీమవరం వచ్చిన నిమ్మల రామానాయుడు స్థానిక ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఉండి ఎమ్మెల్యే పానుమూరి రఘురామకృష్ణరాజు తదితరులు కలవడం జరిగింది.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదిలా ఉంటే ఈనెల 18వ తారీఖున మొదటి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.అనంతరం ఈనెల 19వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు