కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.హైవేలు వేస్తున్నామని చెబుతూ టోల్ రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు.

కేంద్రం రైతులపై కూడా ఆదాయపు పన్ను వేసే యోచనలో ఉందని విమర్శించారు.దేశంలో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్న హామీ ఏమైందన్న మంత్రి కేటీఆర్ పేదలందరికీ ఇళ్లు, ఇంటింటికి నీళ్ల హామీ ఏమైందని అడిగారు.

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని అడిగితే చెప్పే దమ్ము లేదన్నారు.మోదీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఓట్లడుగుతారని ప్రశ్నించారు.

గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచినందుకు మోదీ దేవుడా అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ను విమర్శించడం కాదు.

Advertisement

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తీర్మానం చేయాలని సవాల్ చేశారు.తెలంగాణ బీజేపీకి వెన్నుముక ఉంటే తీర్మానం చేయాలని వెల్లడించారు.

Advertisement