బాలసదనం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని విజయ కాలనీ నందు బాలసదనం (చిల్డ్రన్స్ హోమ్)ను మంగళవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

అక్కడికి చేరుకున్న మంత్రికి బాలసదనం పిల్లలు పుష్పగుచ్చానిచ్చి ఆహ్వానించారు.

బాలసదనంలోని బాలికలతో సరదాగా కబుర్లు చెబుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాలసదనములో ఉన్న సౌకర్యాల గురించి జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మను అడిగి తెలుసుకున్నారు.

బాలసదనంలోని రూములను తిరిగి పరిశీలించారు.అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారి జ్యోతి పద్మకు తెలిపారు.

పిల్లలు నిద్రించు బెడ్లు గురించి మంత్రి పలు సూచనలు చేశారు.బాలసదనం పిల్లలు తెలంగాణ గీతాన్ని ఆలపించగా మంత్రి వారిని అభినందించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్

వెంకట్ నారాయణ గౌడ్,

జెడ్పిటిసి జీడి భిక్షం,జిల్లా బాలల పరిరక్షణఅధికారి రవికుమార్,తాహాసిల్దార్ వెంకన్న,బాలల సంక్షేమ సమితి చైర్మన్,సభ్యులు, బాలసదనం సిబ్బంది బాల రక్షాబంధన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు