కిషన్ రెడ్డి పై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి..!!

కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం తెలిసిందే.

యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇటువంటి తరుణంలో టిఆర్ఎస్ నేత మంత్రి జగదీష్ రెడ్డి..

Minister Jagadish Reddy Serious Comments On Kishan Reddy, Jagadish Reddy, Kisha

కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.కిషన్ రెడ్డి జేస్తున్నది మోసపూరిత యాత్ర.

దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అంటూ మండిపడ్డారు.గుజరాత్ రాష్ట్రంలో 20 సంవత్సరాలు బిజెపి అధికారంలో ఉంది అక్కడ.

Advertisement

చేపట్టలేని ఎన్నో పథకాలు తెలంగాణలో ఏడు సంవత్సరాల లోనే అనేక పథకాలు టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది అని స్పష్టం చేశారు.అసత్యాలు చెప్పాలంటే బీజేపీ నాయకుల తర్వాతే అంటూ గట్టిగా కౌంటర్లు వేశారు.

ఐదు కోట్ల ఉద్యోగాలు హామి ఏమైంది అని స్పష్టం చేశారు.కానీ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడం మాత్రమే కాక ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కొత్త పథకాలు కూడా రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని తెలిపారు.

రెండు పార్టీల మధ్య ఎన్నికల మ్యానిఫెస్టో లు పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా బిజెపి నేతలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన బీజేపీకి త్వరలోనే దేశ ప్రజలు పెద్ద షాక్ ఇస్తారని పేర్కొన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి సుపరిపాలన అందిస్తానని బీజేపీ ప్రజల నెత్తిపై భారం వేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ పై కిషన్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు