పార్టీ మారే ఆలోచనలో మంత్రి గుమ్మనూరు..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ మారే ఆలోచనలో మంత్రి గుమ్మనూరు జయరామ్( Gummanur Jayaram ) ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.మరోవైపు జయరామ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారని తెలుస్తోంది.

అయితే వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరును పార్టీ అధిష్టానం కర్నూల్ లోక్ సభ ఇంఛార్జ్ గా నియమించింది.దీంతో పార్టీ హైకమాండ్ పై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరతారని చర్చ జోరుగా సాగుతోంది.

Validation Check 2026
Advertisement