ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మంత్రి గంగుల వార్నింగ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ జోలికి రావొద్దన్న ఆయన తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.

సజ్జల వీడదీసే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్నారు.

తల్లి, కొడుకు, చెల్లిని వీడదీసింది సజ్జల కాదా అని ప్రశ్నించారు.తెలంగాణతో పెట్టుకుంటే 2014 రిపీట్ అవుతుందని చెప్పారు.

అనంతరం జగన్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని గంగుల పేర్కొన్నారు.సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు విభేదాలు లేవని స్పష్టం చేశారు.

Advertisement

హరీశ్ రావు తమ ఆస్తి అన్న గంగుల.మామా అల్లుళ్ల మధ్య చిచ్చు పెడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరని చెప్పారు.సజ్జల సలహాలు ఇవ్వాల్సింది జగన్ కు.తమకు కాదు అంటూ వ్యాఖ్యనించారు.తమ జోలికి వస్తే బాగుండదని.

మళ్లీ మీ మీద దాడి చేసే రోజు వస్తుందని హెచ్చరించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement