ఏపీ నేతలపై మంత్రి గంగుల విమర్శనాస్త్రాలు

తెలంగాణ సంపదపై ఏపీ నేతల కన్నుపడిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ఆర్ కూతురు షర్మిల ఇక్కడ పాగా వేశారన్న ఆయన పవన్ కల్యాణ్, కేఏ పాల్ కూడా తెలంగాణకు వచ్చారన్నారు.

తాజాగా చంద్రబాబు కూడా తెలంగాణలో ఎంటరయ్యారని చెప్పారు.మళ్లీ ఏపీ, తెలంగాణలను కలపాలన్నదే వీరి అజెండా అని ఆరోపించారు.

మళ్లీ 1956 నవంబర్ 1ని గుర్తుకు తెస్తున్నారన్నారు.తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపేదాకా చంద్రబాబు ఊరుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీలేరు పవర్ ప్లాంట్ ను లాక్కున్న వ్యక్తి చంద్రబాబన్న మంత్రి గంగుల వీరందరి వెనుక బీజేపీ ఉందని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టును ధ్వంసం చేసి తెలంగాణను ఏడారి చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement

ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు మేల్కోకపోతే మన పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని గంగుల స్పష్టం చేశారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement