Errabelli Dayakar Rao : బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి ని 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసింది.. ఎర్రబెల్లి దయాకరరావు

బిజెపి పై ఫైర్ అయిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మునుగోడు ప్రజలు బీజేపీ కి కేంద్ర ప్రభుత్వనికి బుద్ధి చెప్పి, చెప్పుతో కొట్టి నట్లు తీర్పునిచ్చారన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై మంగళవారం జనగామ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఆయన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు.బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసాడు కాబట్టే ఢిల్లీ వరకు తెలిసేటట్లు మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు.

బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి ని 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసింది.హైదరాబాద్ లో ఎన్నికల కోసం భాగ్యలక్ష్మి టెంపుల్ ను, వరంగల్ ఎన్నికల కోసం భద్రకాళి ఆలయాన్ని, మునుగోడు ఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని నాటకం ఆడారు.

మునుగోడు ప్రజలు వారి నాటకాలనికి తెరదించారుమునుగోడు లో బిజెపి ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని, ఆ మేరకు బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలిబయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సిగ్గు లేదు.కరీంనగర్ లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్.

Advertisement

ఎక్కువ మాట్లాడుతున్నాడు.బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలి అని చూస్తున్నదిధరలు పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమే అమిత్ షా, రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణ లో చిచ్చు పెట్టడానికే ఈ ఎన్నికలు తెచ్చారు.

చారిత్ర్రాత్మక తీర్పు ఇచ్చిన మునుగోడు ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నఅక్కరలేని ఎన్నిక తెచ్చిన బిజెపికి బుద్ధి చెప్పిన ప్రజలకు ధన్యవాదాలు.మునుగోడు ప్రజల గోడు వినని మూర్ఖులకు మంచి గుణపాఠం చెప్పిన ప్రజలకు కృతజ్ఞతలుభారత దేశ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి కేసీఆర్ గారికి, బిఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తమ తీర్పుతో దీవించారు.

మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపుదేశ రాజకీయాల్లో కీలక మలుపుమునుగోడు ప్రజలు కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు ఇది మునుగోడు ప్రజల విజయంఅధర్మంపై ధర్మం విజయం కుట్రలు కుతంత్రాలపై విజయం మత విషం, విధ్వంసంపై మానవత్వం విజయం అమ్ముడుపోయిన వ్యక్తిపై నమ్మకం విజయ అహంకారంపై ప్రజల మమకారం విజయం ఢిల్లీ అహంకారం పై – మునుగోడు ఆత్మగౌరవం విజయం అరాచకంపై ప్రజల ఆశలు, ఆకాంక్షల విజయ అబద్ధాలపై నిజమైన అభివృద్ధి విజయం కాంట్రాక్టులు, కమీషన్ల కక్కుర్తిపై ప్రజలు కన్నెర్ర చేసిన విజయ ఎమ్మెల్యేల కొనుగోలును నిలదీసిన నిఖార్సైన తెలంగాణ విజయ ఓ వ్యక్తి స్వార్థంపై నిస్వార్థం గెలుప తెలంగాణలో 5 ఉపఎన్నికలు జరిగాయి.నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక, హుజురాబాద్,మునుగోడు.

నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు టీఆర్ఎస్ గెలిచింది.దుబ్బాక, హుజురాబాద్ సీట్లు మాత్రమే బిజెపి గెలిచింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

మునుగోడు కాంగ్రెస్ సీటు.టిఆర్ఎస్ గెలిచింది.2018 ఎన్నికల్లో బీజేపికి వచ్చిన ఓట్లు 12 వేల 725 మాత్రమే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 97 వేల 239 టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 74 వేల 687 ఇప్పుడు బిజెపికి వచ్చిన ఓట్లు 86,485 టిఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 96,598 కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 23,864 బిజెపి కాంట్రాక్టులు,కమీషన్లు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొన్నది అడుగడుగునా బిజెపి కుట్రలు, కుతంత్రాలు ఆంధ్రాలో 7 మండలాలు కలిపిన కుట్ర విభజన హమీలు విస్మరించిన కుట్ర కాళేశ్వరంకు జాతీయహోదా ఇవ్వని కుట్ర అవినీతి ఆరోపణలతో నీటి కేటాయింపులు తగ్గించే కుట్ర పంటలు కొనుగోలు చేయని కుట్ర విద్యుత్ కోతల, కరెంటు మీటర్ల కుట్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోత కుట్ర అప్పులు పుట్టకుండా కుట్ర మత చిచ్చు రేపే కుట్ర ఎమ్మెల్యేలను కొనే కుట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.బిజెపి తెలంగాణకు శత్రువు తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ అంటడు బియ్యం కొనమంటే, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పమని కేంద్ర మంత్రి పీయూష్ గొయల్ అంటడు మత చిచ్చు పెట్టే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలే రెచ్చగొడతరు ఉచితంగా 24గంటలు కరెంటు ఇస్తేంటే, మోటర్లకు మీటర్లు అంటరు పంటల మార్పిడి అంటే, అవే పంటలు వేయమంటరు ప్రజల మధ్య మంటలు రేపి, చిచ్చులు పెట్టే కుట్రలు బిజెపివి బిజెపి హామీలేమయ్యాయి? విభజన హమీలను గోవింద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు గిరిజన యూనివర్సిటీ రాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు బయ్యారం ఉక్కు చెల్లని చెక్కు జిల్లాకో నవోదయ స్కూల్ లేదు 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలే ఐటిఐఆర్ ను ఇవ్వలే బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైలు అంతే సంగతులు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏవి? బిజెపి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్బి జెపి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా మారింది తెలంగాణ దేశానికే గ్రోత్ ఇంజన్ గా మారింది తలసరి ఆదాయంలో, అభివృద్ధి లో, సంక్షేమంలో, గ్రామీణాభివృద్ధి లో, ఐటీలో, పరిశ్రమల్లో ప్రతీ రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్.తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడ? మీ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ 2016, 3016 ఎక్కడైనా ఉందా? పంటల పెట్టుబడి 10వేలు ఇస్తున్నారా? రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ ఉందా? రైతులకు 5లక్షల ఉచిత బీమా ఎక్కడైనా ఉందా.దళిత బంధు ఆలోచనైనా చేశారా కెసిఆర్ కిట్లు ఎక్కడిస్తున్నారో చెబుతారా కెసిఆర్ ఆలోచన స్థాయికి లేని మీరా మాకు పోటీ?కెసిఆర్ పాలనే దేశానికి శ్రీరామ రక్ష ఎప్పటికైనా కెసిఆర్ పాలనే దేశానికి శ్రీరామ రక్ష కెసిఆర్ ఉన్నంత కాలం మీరు తెలంగాణను ఏమీ చేయలేరుబిజెపి ఆటలు సాగవు.పప్పులు ఉడకవు ఇప్పటికైనా బిజెపికి బుద్ధి వస్తే బాగుంటుంది అక్కరలేని ఎన్నిక తెచ్చి.

Advertisement

అమ్ముడుపోయారని ప్రజల్ని అవమానించి.అబద్ధాలు వల్లించి.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.తెలంగాణకు అన్యాయం చేస్తూ.

ఆఖరుకు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బడా జూటా పార్టీ బిజెపికి ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుంటుంది.

తాజా వార్తలు