ఆధునిక హంగులతో మోడల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తాం మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా అవసరాల కోసం, ఆధునిక హంగులతో మోడల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో సుమారు ఎకరం భూమిలో, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి లతో కలిసి శంకుస్థాపన మంత్రి మల్లారెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మటన్‌, చికెన్‌, చేపలతోపాటు అన్ని వస్తువులు ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా రూ.4,కోట్ల 50 లక్షలతో ఈ మోడల్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.అంతేకాకుండా సకల సౌకర్యాలతో అత్యాధునికమైన నాన్వెజ్ మార్కెట్‌ అందుబాటులోకి రానుందన్నారు.

నాన్వెజ్ మార్కెట్‌లో నాణ్యతో పాటు ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.నాన్వెజ్ మార్కెట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన మంత్రి.

ఈ కారిక్రమానికి మంత్రితో పాటు జవహార్ నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు