ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్రా ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పై మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై ఈసీ పునరాలోచన చేయాలని కోరారు.ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడతారు.
చంద్రబాబు, పవన్( Chandrababu, Pawan ) వాలంటీర్ల సేవలను ప్రశంసించాల్సింది పోయి అడ్డుకుంటున్నారు.జగన్ పై కక్షతో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.వారి కుట్రలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నారు అని మంత్రి అంబటి మండిపడ్డారు.
చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) ద్వారా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించారు.ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా.తన నిర్ణయాన్ని పునారాలోచించుకోవాలి.
పెన్షన్లు తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక్కడ బలవుతోంది వాలంటీర్లే కాదు.
అవ్వ తాతలు, దివ్యాంగులు.సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు.
అని మంత్రి అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy