వైరల్: అత్యంత తక్కువ ఖర్చుతో పోర్షే 911 తరహా ఎలక్ట్రిక్‌ కారు.. జర దేఖో!

ఈ మధ్య కాలంలో స్వదేశీ టాలెంట్ వికసిస్తోంది.మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక గల్లీలో వున్న టాలెంట్ కూడా ఈ ప్రపంచానికి తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు పాత కార్లను లగ్జరీ కార్ల మాదిరిగా తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు.అవును, తాజాగా కేరళకు( Kerala ) చెందిన రాకేష్‌ తాజాగా అద్భుతం చేసి చూపించాడు.

రాకేష్‌ బాబు( Rakesh Babu ) అనే యువకుడు లగ్జరీ పోర్షే 911 తరహా మినియేచర్‌ ఎలక్ట్రిక్‌ కారును తయారు చేసి అందులో ఎంచక్కా డ్రైవ్ కూడా చేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేయగా వెలుగు చూసింది.

దాంతోనే ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisement

అందుకే చాలామంది నెటిజన్లు అతగాడి టాలెంటుని పొగడ్తలతో ముంచేస్తున్నారు.రాకేష్‌ బాబు ఇప్పటికే అనేక పాత వాహనాలను మార్పులు చేసి అక్కడ లోకల్ గా బాగా ప్రసిద్ది చెందాడు.ఈ నేపధ్యంలోనే పిల్లల కోసం తన గ్యారేజీలో పోర్షే 911( Porsche 911 ) మినియేచర్‌ను పోలిన ఎలక్ట్రిక్‌ కారును తయారు చేశాడు.

కాగా ఈ కారు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ ఎలక్ట్రిక్‌ కారు ముందు భాగం పోర్షే 911ని పోలి ఉంటుంది.ఈ కారుకు టీవీఎస్ XL100 హెడ్‌ ల్యాంప్ అమర్చారు.

అదే విధంగా అల్లాయ్ తరహా వీల్స్‌ను ఏర్పాటుచేశారు.ఇక సాధారణ పోర్షే 911 కారులో పోలిస్తే.

కేరళకు చెందిన రాకేష్‌ బాబు తయారుచేసిన ఎలక్ట్రిక్‌ కారులో పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చని జనాలు చెబుతున్నారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

ఇకపోతే కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రానికే చెందిన హదీఫ్‌. పాత మారుతి 800 కారును లగ్జరీ రోల్స్‌ రాయిస్‌( Rolly Royce ) కారుగా మార్చిన సంగతి విదితమే.అవును, మారుతి 800 కారుకు కొన్ని మార్పులు చేసి రోల్స్‌ రాయిస్ కారుగా తయారు చేశాడు.

Advertisement

అంతేకాదండోయ్.కారు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు చేశాడు.

ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ అమర్చాడు.మరియు బ్యానెట్‌పై స్పిరిట్‌ ఆఫ్ ఎక్స్‌టసీ అనే పేరును జత చేశాడు.

కట్ చేస్తే దానికి మంచి లుక్ వచ్చింది.దీంతోపాటు కార్లలో ఉండే బీఎండబ్ల్యూ తరహా ఫీచర్లను అమర్చాడు.

తాజా వార్తలు