అమెరికాలో రెచ్చిపోతున్న అక్రమ వలసదారులు .. న్యూయార్క్ నడిబొడ్డున పోలీసులపై దాడి

అమెరికాలో అక్రమ వలసదారులు, నిరాశ్రయుల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.తాజా ఘటనలో ఏకంగా పోలీసులపై వలసదారులు దాడి చేశారు.

అది కూడా దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో.( New York ) ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌( Times Square ) సమీపంలో వలసదారులతో వున్న గుంపు ఇద్దరు పోలీస్ అధికారులపై దాడి చేసి వారిని దారుణంగా కొట్టింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు గత వారం మాన్‌హట్టన్‌ వెస్ట్ 42వ వీధిలో వలస వచ్చినవారిని అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు.

కాసేపటికీ ఆ గుంపులోని మిగిలిన వలసదారులు( Migrants ) కూడా అక్కడికి చేరుకుని పోలీసులపై మూకుమ్మడిగా దాడి చేసి వారి తల, శరీరంపై విచక్షణారహితంగా కొట్టారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు దుండగులను పోలీసులు( Police ) అరెస్ట్ చేశారు.

Advertisement
Migrant Mob Thrashes Two NYPD Cops Near Times Square In Shocking Video Released

వీరిని డార్విన్ ఆండ్రెస్ గోమెజ్ ఇజ్క్వియెల్ (19), కెల్విన్ సర్వత్ అరోచా (19), జుయారెజ్ విల్సన్ (21), యోర్మాన్ రెవెరాన్ (24)గా గుర్తించారు.వీరిపై దాడికి పాల్పడినట్లుగా అభియోగాలు మోపగా, ఆ వెంటనే ఎలాంటి బెయిల్ లేకుండా విడుదల చేశారు.

Migrant Mob Thrashes Two Nypd Cops Near Times Square In Shocking Video Released

కాసేపటికీ మరో అనుమానితుడు ఝెూన్ బోడా (22)ను( Jhoan Boada ) కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం తెలిపింది.దాడికి సంబంధించిన అదనపు వీడియోను కూడా సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

వలసదారుల దాడిలో( Migrant Mob Attack ) గాయపడిన అధికారులకు చిన్నపాటి గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే చికిత్స అందించారు.దుండగుల్లో ఒకరైన రెవెరాన్‌పై( Reveron ) మాన్‌హాట్టన్‌లో దాడి, దోపిడికి సంబంధించిన రెండు కేసులు వున్నట్లుగా నివేదిక తెలిపింది.

Migrant Mob Thrashes Two Nypd Cops Near Times Square In Shocking Video Released

గతేడాది నవంబర్‌లో నార్డ్ స్ట్రోమ్ ర్యాక్ ఉద్యోగిపై అతను దాడికి పాల్పడినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి.మరో ఘటనలో హెరాల్డ్ స్క్వేర్ మాకీస్‌లో ఓ అధికారిని సైతం కొట్టినట్లుగా నివేదిక తెలిపింది.మరోవైపు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

దేశంలో పోలీస్ అధికారులు, సిబ్బందిపై దాడులు పెరుగుతూ వుండటంపై ఆ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.శాంతి భద్రతల పరిరక్షణలో వున్నప్పుడు న్యాయవ్యవస్థ మమ్మల్ని రక్షించలేకపోతే.

Advertisement

నేరస్తులతో తాము సమర్ధవంతంగా వ్యవహరించలేమని పోలీస్ బెనివలెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెండ్రీ పేర్కొన్నారు.

తాజా వార్తలు