స్మార్ట్‌ఫోన్‌ల కోసం AI బేస్డ్‌ బింగ్‌, ఎడ్జ్‌ లాంచ్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌!

టెక్‌ దిగ్గజం Microsoft సహకారంతో OpenAI కంపెనీ ChatGpt చాట్‌బాట్‌ను రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ ChatGpt లాంచ్‌ అయి కేవలం రెండే నెలలు సమయంలోనే సంచలనాలు క్రియేట్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలో తమ ప్రొడక్ట్స్‌కు ChatGpt టెక్నాలజీని యాడ్ చేస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.దీంతో ChatGptకి పోటీగా Google బార్డ్‌ చాట్‌బాట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసిన సంగతి విదితమే.

అవును, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను విస్తరించడంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఇపుడు పోటీ పడుతున్నాయి.

ఇక తాజాగా AI సామర్థ్యాలతో అప్టేటెడ్‌ బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ఎడ్జ్ బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ లాంచ్‌ చేయడం విశేషం.ChatGPT లాంటి AI సామర్థ్యాలతో అప్డేట్‌ అయిన Bing, Edge ఇప్పుడు ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.ఐఫోన్‌, ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు కన్వర్జేషనల్‌ విధానంలో తమ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు, అలాగే దీన్ని టెస్ట్‌ చేయడానికి వినియోగదారులు సంబంధిత యాప్ స్టోర్ నుంచి ఎడ్జ్ లేదా బింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

Advertisement

ఇక వినియోగదారులు Bing AI ప్రివ్యూ కోసం లాగిన్, సైన్ అప్ చేశారని నిర్ధారించుకోవాలి.

మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంటూ.‘బింగ్‌, ఎడ్జ్‌లో తీసుకొచ్చిన అప్‌డేట్‌ కొన్ని మిలియన్ల మంది వినియోగదారులకు వినియోగపడనుంది.64% మంది జనాలు ఇపుడు మొబైల్ ఫోన్‌లలోనే సెర్చ్‌ చేస్తున్నారు.అందుకే వెబ్‌కు కోపైలట్‌గా పనిచేయడానికి అన్ని కొత్త Bing, Edge మొబైల్ యాప్‌లను విడుదల చేస్తున్నాం’ అని పోస్ట్ చేసింది.

ఇకపోతే ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ని ఉపయోగించడానికి, Bing యాప్‌ని ఓపెన్‌ చేసి, చాట్ సెషన్‌ను ప్రారంభించడానికి దిగువన ఉన్న Bing లోగోపై ట్యాప్‌ చేయవలసి ఉంటుంది.ఈ క్రమంలో తమకు సమాధానాలు ఏ విధంగా డిస్‌ప్లే కావాలనే అంశాన్ని కూడా యూజర్లు సెలక్ట్‌ చేసుకోవ్చు.

బుల్లెట్ పాయింట్‌లు, టెక్స్ట్‌, సింప్లిఫైడ్‌ రెస్పాన్స్‌ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు