కీర దోసకాయ పంటను లీఫ్ మైనర్ తెగుళ్ల బెడద నుంచి సంరక్షించే పద్ధతులు..!

కీర దోసకాయ పంట ( Cucumber crop )తీగ జాతి కూరగాయ పంటలలో ఒకటి.

ఈ పంటను నేల మీద కంటే పైపందిరి లేదా అడ్డుపందిరి పద్ధతిలో సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.

ఈ పంటలో శ్రమతో పాటు పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండాలంటే పంట సాగు విధానంపై ముందుగా అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.

Methods To Protect Cucumber Crop From Leaf Miner Pests , Leaf Miner Pests, Cuc

కీరదోసకాయ పంటను పందిరి విధానంలో సాగు చేస్తే దాదాపుగా కలుపు సమస్య( Weed problem ) లేనట్టే.పైగా కాయల ఆకృతి కూడా బాగుంటుంది.కోతల సమయంలో మొక్కల కాండాలు, కాళ్ళ కింద పడి మొక్కలు లేదంటే కొమ్మలు చనిపోయే అవకాశం ఉండదు.

కాబట్టి ఏ తీగజాతి కూరగాయలు సాగు చేసిన అడ్డుపందిరి లేదంటే పైపందిరి విధానంలో సాగు చేయాలి.ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు ( Black soils, red soils )సారవంతమైన నీరు ఇంతే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

Advertisement
Methods To Protect Cucumber Crop From Leaf Miner Pests , Leaf Miner Pests, Cuc

ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ అఫ్ పోటాష్ ( Murate of potash )ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి, పొలాన్ని కలియ దున్ని నేల వదులు అయ్యేలా దమ్ము చేసుకోవాలి.

Methods To Protect Cucumber Crop From Leaf Miner Pests , Leaf Miner Pests, Cuc

ఒక ఎకరాకు 350 గ్రాముల విత్తనాలు అవసరం.ఇత్తేముందు ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 1.5 మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.కీర దోసకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే లీఫ్ మైనర్ తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ తెగులు లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి.ఈ తెగుళ్లు ఆశించిన మొక్క ఆకులపై తెల్లని చారలు ఏర్పడతాయి.

ఈ తెగుళ్ల నివారణ కోసం మూడు లేదా నాలుగు శాతం వేప నూనెను నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటర్ నీటిలో ఒక మిల్లీమీటర్ ట్రయాజోఫోస్ ను కలిపి పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు