ద్రాక్ష తోటలలో పారదర్శక పోలుసు పురుగులను అరికట్టే పద్ధతులు..!

రైతులు( Farmers ) సాధారణ పంటల సాగుపై కాకుండా ఉద్యానవన పంటల సాగుపై కాస్త అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణ పంటలు ఆరు లేదా ఏడు నెలల్లో చేతికి వస్తాయి.

కానీ ఉద్యానవన పంటలు కొన్ని సంవత్సరాలపాటు నిరంతరం దిగుబడి ఇస్తూనే ఉంటాయి.కాబట్టి ఏ ఉద్యానవన పంటను సాగు చేయాలనుకున్న ముందుగా ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకోవడం తప్పనిసరి.

పంటపై అవగాహన ఉంటేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.

ఉద్యానవన పంటలలో ఒకటైన ద్రాక్ష పంట( Grape crop ) వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.మార్కెట్లో కూడా ఈ పంటకు మంచి డిమాండే ఉంది.అయితే ఈ పంటను ఆశించే చీడపీడా, తెగుళ్లపై అవగాహన అవసరం.

Advertisement

ఈ ద్రాక్ష తోటలకు పోలీసు పురుగుల బెడద కాస్త ఎక్కువ.ఈ పురుగులను అరికట్టకపోతే దిగుబడి చాలా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ పురుగులు మొక్కల కణజాలాల్లోకి ఒక విషపూరిత లాలాజలం ను ఇంజెక్ట్ చేస్తాయి.దీంతో కణజాల రూపం మార్పిడి జరుగుతుంది.

తో మొక్క ఆకులు, కాడలు, పిందెలు,లేత పండ్లు ప్రభావితం అవుతాయి. ద్రాక్ష పండ్లు( Grapes ) పాలిపోయి ముందుగానే రాలిపోతాయి.

మొక్క పెరుగుదల అమాంతం మందగిస్తుంది.ఈ పురుగుల ఉధృతి ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

ద్రాక్ష మొక్కలు బాగా ఏపుగా పెరిగితే ఆ మొక్కలకు ఈ పురుగులు ఆశించే అవకాశం ఉంది.దట్టమైన పొదలు నివారించడం కోసం చెట్లను కత్తిరించాలి.అధిక మోతాదులో నత్రజని ఎరువుల( Nitrogen fertilizers ) వినియోగాన్ని తగ్గించాలి.

Advertisement

ఈ పురుగులు ఆశించిన మొక్కల కొమ్మలు కత్తిరించాలి.ఈ పులుసు పురుగులను ద్రాక్ష తోటలలో గుర్తించిన తర్వాత పైరిప్రాక్సీఫెన్ ఉండే రసాయనాన్ని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయడం వల్ల ఈ పురుగులు పంటను ఆశించకుండా పూర్తిగా అరికట్టవచ్చు.

తాజా వార్తలు