మొక్కజొన్నలో పెనుబంక పురుగులను నివారించే పద్ధతులు

మొక్కజొన్న పంటను( Corn crop ) పెనుబంక పురుగులు ఆశిస్తే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.

ఆకులపై, చిగుర్ల కింది భాగంలో చిన్న చిన్న పురుగులు గుంపులు గుంపులుగా ఏర్పడి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఈ పురుగుల నుండి తేనె రూపంలో ఉండే ఒక బంక ఉత్పత్తి అవుతుంది.ఈ బంక వలన ఫంగస్, ఇతర తెగుళ్లు వ్యాపిస్తాయి.

కీటకాలు( Insects ) ఒక మొక్క నుంచి మరొక మొక్కపైకి వెళ్ళినప్పుడు ఈ పెనుబంక వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది.ఈ పెనుబంక పురుగులు చిన్నగా ఉండి మృదువైన ఆకారం కలిగి 0.5 నుంచి 2 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి.ఈ పురుగులు పసుపు, గోధుమ, ఎరుపు, నలుపు రంగులలో ఉంటాయి.

ముందుగా ఇవి లేత ఆకుల అడుగు భాగనికి చేరి కణజాలాన్ని తినేస్తాయి.వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే వీటి ద్వారా వేరే తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంటుంది.

Advertisement

ఈ తెగులను గుర్తించిన తర్వాత ముందుగా సేంద్రియ పద్ధతిలో నివారించే ప్రయత్నం చేయాలి.పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే తప్పనిసరి పరిస్థితులలో రసాయన పద్ధతులు ఉపయోగించి వీటిని వెంటనే అరికట్టాలి.సేంద్రీయ పద్ధతిలో కీటక నాశక సబ్బు ద్రావణాన్ని ఉపయోగించి ఈ పురుగులను నివారించాలి.

లేదంటే ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల వేప నూనెను( Neem oil ) కలిపి మొక్కలు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.తేమ అధికంగా ఉన్నప్పుడు మాత్రమే పెనుబంక సోకే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో పంటంపై దృష్టి పెట్టి సకాలంలో నివారించాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ పెనుబంక పురుగులను నివారించడం కష్టం అయితే అటువంటి సందర్భంలో రసాయన పిచికారి మందులైన టాఫ్గోర్, అనుగోర్, ధర్గోర్, లలో ఏదో ఒక రసాయనాన్ని ఎంపిక చేసుకుని పంటకు పిచికారి చేసి పెనుబంక పురుగులను నివారించాలి.పెనుబంక పురుగులు నివారించబడితే మొక్క ఎదుగుదల సక్రమంగా ఉండి నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Advertisement

తాజా వార్తలు