విలీనాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్తేమీ కాదు .. బీఆర్ఎస్ కంగారుపడుతోంది 

బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ ( Congress )లో విలీనం కాబోతున్నట్లు గత కొద్దిరోజలుగా హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 9మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు బీ ఆర్ ఎస్ అధిష్టానానికి కంగారు పుట్టిస్తోంది.వాస్తవంగా తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు,  విలీనాలు కొత్తవి కాదు.

  2014 నుంచి 2023 వరకు ఇదే తరహా రాజకీయం నడిచింది.ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ కూడా వెళ్తోంది.

గతంలో బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సమయంలో టిడిపి ఎల్పీ ని విలీనం చేసుకుంది.ఆ తర్వాత మరోసారి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది.

Advertisement

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది.బీఆర్ఎస్( BRS ) నుంచి కాంగ్రెస్ లోకి 9 మంది ఎమ్మెల్యేలు చేరగా , రెండు రోజుల్లోనే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,( MLA Prakash Goud )  శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు .దీనిపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడంతో , కాంగ్రెస్ కూడా ఎదురు దాడి మొదలు పెట్టింది.

అసలు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది బీఆర్ఎస్ అని, లేని ఆలోచనను రేకెత్తించింది బీఆర్ఎస్ బిజెపి అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టింది.  పూర్తిస్థాయి మెజార్టీ వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులుస్తామని కొంతమంది,  దానంతట అదే కూలిపోతుందని మరి కొంతమంది సెటైర్లు వేయడం,  దీనిని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎన్నికల ఫలితాలు తర్వాత ఫిరాయింపులు ఉండని చెప్పిన మాటను పక్కనపెట్టి తమకు ముప్పు లేకుండా చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు .దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,  ఆ పార్టీని బలహీనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు.  దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని  కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనే ఎత్తుగడతో ఉన్నారు.

వాస్తవంగా విలీనం జరగాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేల అవసరం.ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు .మరో రెండు వారాల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతుండడంతో,  ఆలోపే మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.దీని తర్వాత శాసనమండలి పైన కాంగ్రెస్ దృష్టి పెట్టబోతోంది.

శాసనమండలిలో కాంగ్రెస్ కు పూర్తిస్థాయిలో బలం లేదు.దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలనూ చేర్చుకునే విషయం పైన పూర్తిగా ఫోకస్ చేస్తోంది.

మీడియా రంగంలోకి రాబోతున్న నాగబాబు.. ఇక జన సేనకు తిరుగుండదు?
Advertisement

తాజా వార్తలు