చూపు లేని వారు ఇకపై చూడగలరు.. ఎలా అంటే?

మానవ శరీరంలో మనిషికి ప్రతి అవయవం, ఇంద్రియాలు ముఖ్యమే.ఏది లేకపోయినా వాళ్లు జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇతరుల్లా సాధారణ జీవితం గడపటం సాధ్యం కాదు.శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కళ్లు అతి ముఖ్యమైనవి.

Melbourne Scientists Invented Bionic Eye, Bionic Vision, Bionic Eye, Australia'

కళ్లు లేని వాళ్లు దైనందిన జీవితంలో ఎక్కువగా ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.కొందరు పుట్టకతోనే కంటిచూపు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడితే మరికొందరు వేర్వేరు కారణాల వల్ల చూపును కోల్పోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు కంటి చూపు లేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి చూపు లేని వారి కోసం వైద్యులు, శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.

Advertisement

బయోనిక్ సొల్యూషన్స్ ద్వారా చూపు లేని వారికి చూపు తెప్పించే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.అయితే ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో తాజాగా ఒక ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తేలింది.

ఆస్ట్రేలియాకు చెందిన మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు బయోనిక్ ఐ ని అభివృద్ధి చేశారు.శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే ఇది తొలి బయోనిక్ ఐ అని, బయోనిక్ ఐ ద్వారా కంటిలో డ్యామేజ్ అయిన నెర్వ్స్ ను బైపాస్ చేసి చూపు కనిపించేలా చేయవచ్చని చెబుతున్నారు.

ప్రత్యేకంగా తయారు చేసిన ఒక హెడ్ గేర్ సహాయంతో బయోనిక్ ఐ పని చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.బయోనిక్ ఐ ద్వారా సాధారణ కన్ను అంత స్పష్టంగా చూపు కనిపించకపోయినా ఇంటికి బయటకు తేడాను వస్తువులను గుర్తించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు మొదట గొర్రెలపై ప్రయోగాలు చేయగా ప్రయోగం సక్సెస్ అయింది.దీంతో మెల్ బోర్న్ లోనే శాస్త్రవేత్తలు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమవుతున్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే కంటి చూపు లేని వారు సైతం చక్కగా చూడొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు