వైరల్ అవుతున్న మెగాస్టార్ లుక్స్!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి ప్రస్తుత తరం హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయడానికి సై అంటున్నాడు.

ఇప్పటికే ఖైది నెంబర్ 150 సినిమాతో తన రీ ఎంట్రీని గ్రాండ్ గా లాంచ్ చేసిన మెగాస్టార్ ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాని కంప్లీట్ చేసి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక సైరా సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు షేర్‌ చేసింది.దీంతో ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

మెగాస్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అని కొందరు, ఈ లుక్‌ లో చిరు మరింత హ్యాండ్స్‌ సమ్‌ గా కనిపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.కాగా ఉపాసన ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్నారు.

Advertisement

ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం మెగాస్టార్‌ ఫొటోషూట్‌ చేశారు.దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేసింది ఉపాసన.

ఇక ఈ ఫోటోలపై మెగా ఫ్యామిలీ మీద మొన్నటి వరకు విరుచుకుపడిన శ్రీ రెడ్డి కూడా పోజిటివ్ గా కామెంట్ చేసింది.అందంలో అయిన, అభినయంలో అయిన చిరంజీవిని బీట్ చేసేవారు ఇంకెవరు లేరు.

అతని తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేయడం విశేషం.

తాజా వార్తలు