విశ్వంభర మూవీ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఇలా చేయడం రైట్ కాదంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంభర( vishwambhara ).

ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.గత ఏడాది ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు మూవీ మేకర్స్.

కానీ వి ఎఫ్ ఎక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో 205 సమ్మర్ లో విడుదల చేస్తామంటూ ప్రకటించారు.ఇంతవరకు బాగానే ఉన్నా సమ్మర్ లో విడుదల చేస్తామని చెప్పిన మూవీ మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Megastar Chiranjeevi Vishwambhara Updates, Vishwambhara, Vishwambhara Movie, Chi

మే నెలలో సినిమాను విడుదల చేయాలని భావించినా సాధ్యం అయ్యేలా లేదు.అయితే ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్‌ పూర్తి అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.షూటింగ్‌ పూర్తి చేసి వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ కిందా మీదా పడుతున్నారు.

Advertisement
Megastar Chiranjeevi Vishwambhara Updates, Vishwambhara, Vishwambhara Movie, Chi

విశ్వంభర టీజర్ వీఎఫ్ఎక్స్( VFX ) విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో మూవీ మేకర్స్‌ సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్‌ఎక్స్ టీం ను ఈ సినిమా కోసం రంగంలోకి దించారట.

Megastar Chiranjeevi Vishwambhara Updates, Vishwambhara, Vishwambhara Movie, Chi

బడ్జెట్‌ పెరగడంతో పాటు సమయం కూడా దాదాపు నాలుగు నుంచి ఆరు నెలలు అధికంగా పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.దాంతో సినిమా మే నెలలో విడుదల కాకపోవచ్చు అంటున్నారు.ఈ సినిమా అనుకున్న సమయానికంటే ఇంకా ఆలస్యం అవుతూ వెళ్తుండడంతో ఈ విషయం పట్ల మెగా అభిమానులు మండిపడుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు విడుదల చేయకపోవడంతో మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు అభిమానులు.మరి ఇప్పటికైనా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ను ఇస్తారేమో చూడాలి మరి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు