'భోళా శంకర్' రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇవ్వబోతున్న మెగా స్టార్ చిరంజీవి..?

నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )) చూడని సూపర్ హిట్ సినిమా లేదు, అయితే ఎంత పెద్ద ఫ్లాప్ సినిమా అయ్యినప్పటికీ మొదటి మూడు రోజులు మాత్రం అద్భుతమైన వసూళ్లు వస్తుంటాయి.

అందుకే ఆయనని మెగాస్టార్ అని అందరూ పిలుస్తూ ఉంటారు.

రీ ఎంట్రీ తర్వాత నాన్ రాజమౌళి హైయెస్ట్ వేకాంద కోట్ల రూపాయిల షేర్స్ ఉన్న హీరో గా చరిత్ర సృష్టించిన చిరంజీవి, డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను కూడా ఆ రేంజ్ లోనే అందుకున్నాడు.ఆయన తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య( Acharya ) చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.మళ్ళీ ఇలాంటి ఫ్లాప్ మెగాస్టార్ కి రాదనీ అనుకున్నారు.

కానీ ఈలోపే రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో ఆచార్య ని మించిన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు.

Advertisement

ఈ సినిమా మొదటి రోజు నుండే ఊహకందని తక్కువ వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఒకప్పుడు చిరంజీవి మొదటి రోజు వసూళ్లు 30 కోట్ల రూపాయలకు పైగా ఉండేది.

ఖైదీ నెంబర్ 150 , సై రా నరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య మరియు ఆచార్య చిత్రాలు ఇలాగె మొదటి రోజు 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాయి.కానీ భోళా శంకర్( Bhola Shankar ) చిత్రానికి ఫుల్ రన్ లో కూడా అంత వసూళ్లు రావు అని వినిపిస్తున్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు.

దీంతో ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలకు కలిపి 50 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

కనీసం 20 శాతం కూడా వసూళ్లను రాబట్టలేదు కాబట్టి నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) బయ్యర్స్ కి కచ్చితంగా డబ్బులు తిరిగి ఇవ్వాలి.అసలే ఏజెంట్ సినిమా( Agent Movie ) నష్టాలతో నిండా మునిగిపోయి ఉన్న నిర్మాత అనిల్ సుంకర కి ఇప్పుడు భోళా శంకర్ రూపం లో మరో పెద్ద తలనొప్పి వచ్చి పడింది.దీంతో పూర్తిగా కష్టాల్లో చిక్కుకున్న అనిల్ సుంకర ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చాడు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈ చిత్రం ఒప్పుకున్నప్పుడు అనిల్ సుంకర చిరంజీవి కి 65 కోట్ల రూపాయిలు రెమ్యూనరేష( Chiranjeevi Remuneration )న్ ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు.సినిమా షూటింగ్ ప్రారంభం లోనే అందులో భాగంగా 30 కోట్ల రూపాయిలు ఇచ్చాడు.

Advertisement

సినిమా విడుదల తర్వాత మరో 35 కోట్ల రూపాయిలు అనిల్ సుంకర ఇవ్వాల్సి ఉండగా, ఆ 35 కోట్లు ఇవ్వనవసరం లేదని, బాగా నష్టపోయావు కాబట్టి నేను తీసుకున్న 30 కోట్ల రూపాయలలో 15 కోట్లు తిరిగి ఇస్తున్నాను అని చిరంజీవి భరోసా ఇచ్చాడట.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు