దేవుడు నాకిచ్చిన తమ్ముళ్లు సాధించిన విజయం ఇది.. చిరు కామెంట్స్ వైరల్!

సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటించిన బేబీ సినిమా(Baby Movie) ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.

అలాగే నటీనటులకు దర్శక నిర్మాతలకు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు లభించడమే కాకుండా వీరికి మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా  హాజరయ్యారు.

చిరంజీవి గారిని తాము ఎంత ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో కొనసాగాము అన్న విషయాల గురించి ఇంత గొప్పగా వివరించారు.ఇక చిరంజీవి మాట్లాడుతూ ఇది బేబీ సినిమా వేడుకల కాకుండా తన సన్మాన సభలా ఉంది అంటూ చమత్కరించారు.అనంతరం ఈయన మాట్లాడుతూ తాను నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే తన కొడుకు విజయాలను చూస్తూ పుత్రోత్సాహం అనుభవిస్తున్నాను.

Advertisement

అదేవిధంగా తోడబుట్టిన తమ్ముళ్లు విజయం సాధిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో చూశాను.ఇప్పుడు ఆ దేవుడిచ్చిన తమ్ముళ్లు నా అభిమానులు ( Chiranjeevi Fans ) సాధించిన ఈ విజయం చూస్తుంటే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనని తెలిపారు.

అనంతరం చిరంజీవి దర్శక నిర్మాతల గురించి కూడా మాట్లాడుతూ ఎస్ కె ఎన్, సాయి రాజేష్ లని ముందు నుంచి గమనిస్తున్నా.థియేటర్స్ లో నా సినిమాలు చూడడం దగ్గరే ఆగిపోకుండా కష్టపడి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.నా అభిమానులు ఇంత పెద్ద విజయం సాధించాలని అవడం కోసమే ఈ కార్యక్రమానికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అనంతరం వైష్ణవి చైతన్య పై కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement

తాజా వార్తలు