మెగాస్టార్ స్వాగ్.. ''యమహానగరి'' వైబ్స్.. పిక్స్ వైరల్!

వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్.

( Bhola Shankar ) ఇక చిరంజీవి ( Chiranjeevi ) ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.

అందుకే ఫుల్ ఖుషీగా తన నెక్స్ట్ సినిమా భోళా శంకర్ ను పూర్తి చేస్తున్నాడు.తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్( Director Meher Ramesh ) డైరెక్ట్ చేస్తున్నాడు.

తమన్నా ( Tamanna ) హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ కోసం టీమ్ అంత కలకత్తా వెళ్లిన విషయం తెలిసిందే.స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా మేకర్స్ మరికొన్ని పిక్స్ షేర్ చేసారు.మెగాస్టార్ వింటేజ్ హిట్ చూడాలని ఉంది లో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమా వైబ్స్ కూడా ఇప్పుడు భోళా శంకర్ కు కలిసి వస్తున్నాయి.

దీంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి.ఇక అక్కడ టీమ్ ఈ రోజు నుండి యాక్షన్ స్టార్ట్ చేసినట్టు మెగాస్టార్ ఆన్ సెట్ లోని పిక్చర్స్ షేర్ చేయడంతో ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ పిక్స్ లో మెగాస్టార్ మరింత స్వాగ్ లుక్ లో చార్మింగ్ గా కనిపిస్తున్నాడు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఇక ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.మరి ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇంకా సమయం చాలానే ఉండడంతో ఎప్పుడు షూట్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు