ఏడు సినిమాల్లో మూడు చిరంజీవివే.. మెగాస్టార్ కే ఈ రికార్డ్ సొంతమా?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అందరూ భావిస్తారు.

రీఎంట్రీలో చిరంజీవి హవా కొంతమేర తగ్గినా సీనియర్ హీరోలలో చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వడం ఇతర హీరోలకు సైతం కష్టమవుతోంది.

ఏడో రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన టాప్7 సినిమాలలో మూడు సినిమాలు చిరంజీవివే ఉండటం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఈ రేర్ రికార్డ్ సొంతం కావడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషం కలిగిస్తోంది.వాల్తేరు వీరయ్య ఏడో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే ఏడో రోజు ఈ సినిమా ఏకంగా 4.85 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలను పరిశీలిస్తే అల వైకుంఠపురములో మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఈ సినిమా కలెక్షన్లు ఏకంగా 8.43 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఈ జాబితాలో బాహుబలి2 సినిమా రెండో స్థానంలో ఉంది.

సైరా నరసింహారెడ్డి మూడో స్థానంలో సరిలేరు నీకెవ్వరు నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్ ఐదో స్థానంలో ఖైదీ నంబర్ 150 ఆరో స్థానంలో వాల్తేరు వీరయ్య ఏడో స్థానంలో ఉన్నాయి.టాప్ 7లో మూడు సినిమాలు చిరంజీవివే కావడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది.

Advertisement

చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు