గాడ్‌ ఫాదర్ : వాయిదా పడ్డ చిరు, సల్మాన్ ఖాన్ తార్‌మార్‌ నేడే

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

సినిమా కు సంబంధించిన తార్ మార్ అనే పాటను ఇటీవల విడుదల చేయాల్సి ఉంది.

కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌ వల్ల పాటను వాయిదా వేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.కేవలం ఆడియో పాటలు మాత్రమే విడుదల చేశారు.

నేటి సాయంత్రం వీడియో విడుదల చేయబోతున్నట్లుగా మరో సారి చిత్రం యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.పాట కోసం చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ యొక్క విజువల్స్ ఎంపిక చేయడంలో లేట్ అవ్వడం కారణంగా పాటని ఆ సమయంలో వాయిదా వేయడం జరిగిందని ఔట్ పుట్‌ సరిగా తీసుకొచ్చే ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మలయాళం సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌ కి ఈ చిత్రం రీమేక్ అనే విషయం తెలిసిందే.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

సినిమా లో చిరంజీవితో పాటు సల్మాన్, ఖాన్ పూరి జగన్నాథ్, నయనతార, సత్యదేవ్, సునీల్ ఇంకా తదితరులు నటించారు.ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కాబోతున్న కూడా ఇప్పటి వరకు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ కాలేదు.

దాంతో మెగా అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో తార్ మార్ పాట విడుదల తో కచ్చితంగా సినిమా పై ఆసక్తి పెంచడం లో యూనిట్ సభ్యులు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రేక్షకులు కూడా ఉన్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి రాబోయే సినిమాలకు కూడా అత్యంత కీలకంగా మారింది.ఆచార్య ప్లాప్ అయినా కూడా గాడ్ ఫాదర్ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో సినిమా స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు