మెగా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.

కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.గాడ్ ఫాదర్ పోస్టర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి మాస్ టీజర్ తో అలరించారు.

కారులో నుంచి ఆయన దిగిన స్టైల్ చూసి మెగా ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చాయని చెప్పొచ్చు.ఆల్రెడీ మళయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ సినిమా రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా వస్తుంది.

ఈ సినిమా తెలుగు వర్షన్ లో చిరు ఇమేజ్ కి తగినట్టుగా కొన్ని మాస్ సీన్స్ యాడ్ చేశారని తెలుస్తుంది.సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Megastar Chiranjeevi Godfather First Look Teaser Released Megastar Chiranjeevi ,

చిరు కి సపోర్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ తన పాత్రతో మెప్పించనున్నారు.సల్మాన్ ఖాన్ డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇదే అని చెప్పొచ్చు.

Megastar Chiranjeevi Godfather First Look Teaser Released Megastar Chiranjeevi ,

కొన్నాళ్లుగా గాడ్ ఫాదర్ పోస్టర్ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఫైనల్ గా అంచనాలకు తగినట్టుగానే మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఫాస్ట్ లుక్ టీజర్ అదిరింది.టీజర్ తోనే రికార్డులు చెడుగుడు ఆడటం కన్ ఫర్మ్ అని చెప్పేశారు.

మోహన్ రాజా డైరక్షన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది.థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో నయనతార సత్యదేవ్, సునీల్ కూడా నటిస్తున్నారు.

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా సినిమాని ఈ దసరాకి రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేశారు.సో దసరాకి మెగాస్టార్ సినిమా ఖర్చీఫ్ వేశారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

మిగతా సినిమాల ఆర్డర్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు