నిప్పులేనిదే పొగరాదు, చిరు 152 టైటిల్‌ 'గోవింద ఆచార్య'

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందబోతుంది.

ఇప్పటి వరకు కొరటాల చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి.అందుకే ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లో నిలిచిపోయేలా ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా, రికార్డు బ్రేకింగ్‌ మూవీగా నిలుస్తుందని ముందు నుండే మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉంటున్నారు.

Megastar Chiranjeevi First Look Govindha Acharya Relase In Social Media

  ఇటీవలే మెగా 152 చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ అంటూ ఒక పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది.

గోవింద ఆచార్య అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు ఒక ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే అర్థం వచ్చేలా ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి లుక్‌ను తయారు చేశారు.ఫస్ట్‌లుక్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

Advertisement
Megastar Chiranjeevi First Look Govindha Acharya Relase In Social Media-ని�

ఖచ్చితంగా మరో బ్లాక్‌ బస్టర్‌ చిరంజీవి ఖాతాలో పడబోతుందని అనుకున్నారు.

Megastar Chiranjeevi First Look Govindha Acharya Relase In Social Media

  మెగా 152 చిత్రం టైటిల్‌ గోవింద ఆచార్య అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఖరారు చేయలేదని, సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత తామే స్వయంగా ప్రకటిస్తామంటూ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రకటించింది.అయితే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.

మరి చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకోకుండానే ఈ టైటిల్‌ ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకునేందుకు కావాలని ఈ టైటిల్‌ను లీక్‌ చేశారేమో, దీన్నే త్వరలో ఫైనల్‌ చేస్తారేమో అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ద్రాక్ష పండ్ల‌లో గింజ‌లు పారేస్తున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు