సినిమా రివ్యూ చూస్తే చాలా బాధనిపించింది... నన్ను టీచర్లా తీర్చిదిద్దింది ఆ జర్నలిస్టే: చిరంజీవి

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా మెగాస్టార్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఈ పేరు వెనుక ఎన్నో అవమానాలు కష్టం బాధలు ఉన్నాయని మెగాస్టార్ ఎన్నోసార్లు వెల్లడించారు.ఇలా తన జీవితంలో తాను ఎదగడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేశారని చెప్పిన మెగాస్టార్ ప్రస్తుతం తాను ఇలా ఉన్నానంటే కొందరు జర్నలిస్టులు కూడా తనకి కారణమని తెలియజేశారు.

ప్రాణం ఖరీదు సినిమా సమయంలో చిరంజీవి ఫోటో పేపర్లో వేసి ఆయన గురించి ఒక జర్నలిస్ట్ మంచిగా రాశారట.అది చూసిన చిరంజీవి ఆ జర్నలిస్టుని పిలిపించి అతనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పగా అతను మాట్లాడుతూ మీలాంటి నటులను ఎంకరేజ్ చేయడం కోసమే రాశానని చెప్పారట.

ఇంతకీ ఆ జర్నలిస్ట్ మరెవరో కాదు దివంగత పసుపులేటి రామారావు అని చిరంజీవి చెప్పారు.ఇలా పసుపులేటి రామారావు చేసిన ఈ పని వల్ల నాకు జర్నలిస్టులపై అపారమైన గౌరవం పెరిగిందని మెగాస్టార్ వెల్లడించారు.

Advertisement

ఆయన తర్వాత గుడిపూడి శ్రీహరి సితారలో సినిమా రివ్యూలు రాసేవారు ఆయన రాసిన సినిమా రివ్యూ చూస్తే చాలా బాధ అనిపించేది.

ఏంటి మరి ఇంత కటువుగా రాశారు అనిపించేది.అయితే తన నటనలో ఉన్న మైనస్ పాయింట్లు అన్నింటిని చూపెడుతూ ఆయన ఒక టీచర్ లాగా నాలో తప్పులను గుర్తించి సరిదిద్దారు.అలాగే మరొక సినిమా రివ్యూలో భాగంగా నటనలో స్పీడ్ ఉండొచ్చు కానీ, మాటల్లో ఉండకూడదు అని రాశారు.

ఆయన రాసిన ఆ మాట నన్ను ఎంతగానో ఆలోచింపజేసి చివరికి తన మాటలలో న్యాయం ఉందని తన డైలాగ్ మాడ్యులేషన్ పూర్తిగా మార్చుకున్నానని,ఈ విధంగా నా జీవితాన్ని ఇలా మలిచిన వారిలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలియ చేశారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు