క్లిన్ కారాతో మొదటి వినాయక చవితి ఉత్సవాలలో మెగా కుటుంబం... వైరల్ అవుతున్న ఫోటోలు!

నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలలో నిమగ్నమయ్యారు.

ఇకపోతే సెలబ్రిటీలు కూడా వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ పండుగకు సంబంధించిన కొన్ని ఫోటోలను సెలబ్రిటీల సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా కుటుంబంలో కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) వినాయక చవితి పండుగకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలను షేర్ చేసిన రామ్ చరణ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాలలో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నాను.

Advertisement

ఈసారి ప్రత్యేకత చిన్ని క్లిన్ కారా( Klin Kaara ) తో కలిసి వినాయక చవితి జరుపుకోవడం అంటూ ఈయన వినాయక చవితి పండుగకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఇందులో చిరంజీవి అమ్మగారు అలాగే చిరంజీవి రామ్ చరణ్ దంపతులతో పాటు శ్రీజ కూతుర్లు సుస్మిత కూతుర్లు కూడా ఉన్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానుల దృష్టి అంత క్లీన్ కారా పైనే ఉంది ఈ ఫోటోలలో ఈమె చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫేస్ కనపడకుండా ఉపాసన( Upasana ) చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రస్తుతం మెగా ఇంట జరిగినటువంటి వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు