తన తదుపరి సినిమా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్న వరుణ్‌

వరుణ్ తేజ్‌ హీరోగా ఈ ఏడాది ఇప్పటికే గని సినిమా వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా లో బాక్సింగ్‌ చేస్తూ వరుణ్‌ తేజ్ కనిపించాడు.

బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన గని సినిమా అట్టర్ ప్లాప్‌ అయ్యింది.సినిమాకు సంబంధించిన టాక్ నెగటివ్ గా వచ్చిన నేపథ్యంలో వరుణ్ తేజ్ అభిమానులకు ఓపెన్ లెటర్‌ ఇచ్చాడు.

తాను చాలా బాగుంటుందని సినిమా చేశాను.ఇప్పుడు సినిమా నిరాశ పర్చినందుకు బాధగా ఉందని గని సినిమా గురించి ఆసక్తికర పోస్ట్‌ ను కూడా పెట్టడం జరిగింది.

వరుణ్ తేజ్ మళ్లీ ఎఫ్‌ 3 తో తక్కువ గ్యాప్‌ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఎఫ్ 3 సినిమా ప్రమోషన్‌ లో భాగంగా రెగ్యులర్‌ గా వరుణ్ తేజ్ తదుపరి సినిమాలకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు.

Advertisement

మొదట అనుకున్న ప్రకారం అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా ఉండాలి.కాని గని ప్లాప్‌ అవ్వడం వల్ల ప్లాన్ చేంజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ఎందుకంటే ఎఫ్ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.సక్సెస్ అయితే పర్వాలేదు కాని గని మాదిరిగా ఎఫ్ 3 అయితే పరిస్థితి ఏంటీ అనే ఉద్దేశ్యంతో వరుణ్ తేజ్ తదుపరి సినిమాల విషయంలో కాస్త వెయిట్‌ అండ్ సీ అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు.

మీ రాబోయే సినిమాలు ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో ప్రస్తుతానికి తాను పూర్తి దృష్టిని ఎఫ్ 3 పైనే పెట్టాను అన్నాడు.ఆ తర్వాత సినిమా గురించి చెప్పలేను అన్నట్లుగా చెప్పడంతో అభిమానుల్లో సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది.

 ప్రవీణ్‌ సత్తారు ప్రస్తుతం ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా ఫలితం ఆధారంగా కూడా వరుణ్ తేజ్ సినిమా ఎంపిక ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

మొత్తానికి కాస్త అటు ఇటుగా వరుణ్‌ తేజ్ ఉంటుంది కాని ఇప్పటికిప్పుడు సినిమా ఏం చేయబోతున్నాడు చెప్పలేను అన్నాడు.

Advertisement

తాజా వార్తలు