ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేతల భేటీ..!!

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది.

ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఇవాళ సీఎంను ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చేసిన తీర్మానంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు