ఏఐసీసీ అధ్యక్షుడుతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ..!

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరికాసేపటిలో భేటీ కానున్నారు.ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం.

ఈనెల 26న నిర్వహించే చేవెళ్ల బహిరంగ సభపై పార్టీ నాయకులు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా దళిత, గిరిజన డిక్లరేషన్లపై కూడా నేతలు సమీక్షించనున్నారు.

దాంతో పాటు తెలంగాణలో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్వహించనున్న ప్రచారంపై చర్చించనున్నారు.కాగా ఈ చేవెళ్ల సభకు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారన్న సంగతి తెలిసిందే.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు