CM Revanth Reddy : మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తులకు పనికి రాదు..: సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ట్విట్టర్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టు( Medigadda Project ) మరమ్మత్తులకు పనికి రాదని చెప్పారు.

మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని తెలిపారు.

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్( KCR ) ధన దాహానికి బలైందని ఆరోపించారు.మేడిగడ్డపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని ధ్వజమెత్తారు.కాళేశ్వరం( Kaleshwaram ) కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ మేడిగడ్డ సందర్శనకు ఎందుకు రావడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు