చిక్కుడు పంటకు తెగుళ్లు ఆశించకుండా చేపట్టవలసిన సంరక్షక చర్యలు..!

తీగజాతి కూరగాయలలో చిక్కుడు పంట( Beans Crop ) కూడా ఒకటి.ఈ చిక్కుడును సాధారణ పద్ధతిలో, పందిరి పద్ధతిలో సాగు చేస్తారు.

పందిరి పద్ధతిలో సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.పైగా పందిరి పద్ధతిలో సాగు చేస్తే ఆశించే చీడపీడలను, తెగులను( Pests ) సకాలంలో గుర్తించి పంటను సంరక్షించుకోవడానికి అవకాశాలు ఎక్కువ.

కాబట్టి చాలామంది రైతులు పందిరి పద్ధతిలో చిక్కుడు పంటను సాగు చేస్తున్నారు.

ఈ చిక్కుడు పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో తుప్పు తెగులు కీలకపాత్ర పోషిస్తాయి.ఈ తుప్పు తెగులు ఒక ఫంగస్( Fungus ) వల్ల పంటకు సోకుతాయి.మట్టిలో ఉండే ఇతర మొక్కల అవశేషాల్లో ఈ ఫంగస్ జీవించి ఉంటుంది.

Advertisement

మొక్క కణజాలాన్ని తిని జీవిస్తుంది.ఈ ఫంగస్ మొక్కల సహాయం లేకుండా జీవించలేదు.

గాలి, నీరు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.చిక్కుడు మొక్క ఆకులపై గోధుమ రంగు నుండి పసుపు రంగు బుడిపెలు ఏర్పడి చిరిగిపోయినట్లు కనిపిస్తే.

ఆ మొక్కలకు తుప్పు తెగులు సోకినట్టే.ఈ తెగులు ముందుగా ఆకులను ఆశించి ఆ తర్వాత మొక్క కాండం, కాడలకు సోకుతుంది.

లేత మొక్కలకు తుప్పు తెగులు ఆశిస్తే మొక్కలు చనిపోతాయి.పెద్ద మొక్కలకు ఆశిస్తే మొక్కల ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరంపై జెండా పాతిన ఎన్ఆర్ఐ జంట

చిక్కుడు పంటకు తుప్పు తెగులు ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకోవాలి.చిక్కుడు పంటలో అక్కడక్కడ మొక్కజొన్న విత్తనాలు( Seeds ) నాటుకోవాలి.

Advertisement

పొలంలో కలుపు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.మొక్కల ఆకులపై ఎక్కువసేపు తేమ( Moisture ) లేకుండా చూసుకోవాలి.

సేంద్రీయ పద్ధతిలో బాసిల్లస్ సబ్టిలిస్, అర్ధోరోబాక్టర్ లాంటి జీవ కీటక నాశనులను ఉపయోగించి ఈ తెగులు నియంత్రించవచ్చు.రసాయన పద్ధతిలో త్రయాజోల్, స్ట్రోబిల్లురిన్ లాంటి రసాయనాలను ఉపయోగించి మొక్కలపై పిచికారి చేసి ఈ తెగులను నివారించవచ్చు.

తాజా వార్తలు