Texas : టెక్సాస్‌లో విషాదం.. మోటోక్రాస్ ప్రాక్టీస్ చేస్తూ 14 ఏళ్ల బాలుడు మృతి..

మోటోక్రాస్( Motocross ) అనేది ఒక ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ రేసింగ్ స్పోర్ట్స్( Racing Sports ).

ఇందులో, రైడర్లు ఒక క్లోజ్డ్‌ ట్రాక్‌లో, ఎత్తులు, మలుపులు, బురదతో కూడిన ప్రాంతాల ట్రాక్‌లో పోటీపడతారు.

ఈ క్రీడలో చాలా నైపుణ్యం, ధైర్యం అవసరం.ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ.

దురదృష్టవశాత్తు మెక్సికోకు చెందిన 14 ఏళ్ల మోటోక్రాస్ లవర్ ఈ ఆట ప్రాక్టీస్ చేస్తూ ఒక పొరపాటు చేశాడు.అది అతడి ప్రాణాలను తీసేసింది.

వివరాల్లోకి వెళితే, 2024, మార్చి 20న మాటియో డియాజ్ టెక్సాస్‌లో మోటోక్రాస్ ప్రాక్టీస్ చేస్తూ తీవ్రమైన ప్రమాదానికి గురయ్యాడు.ఈ ఘటనలో బాగా గాయపడ్డాడు.

Advertisement

రెండు రోజుల పాటు మాటియో మరణంతో పోరాడి చివరికి మరణించాడు.ఈ మృతితో చాలా దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ, మాటియో తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తమ కొడుకు అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ దయతో కూడిన చర్య చాలా మంది ప్రాణాలను కాపాడగలదు.

మాటియో( Mateo Diaz ) మోటోక్రాస్‌ను ఎంతగానో ప్రేమించేవాడు.తన కలలను చేజ్ చేయడానికి తన కుటుంబంతో కలిసి U.S.కి వలస వచ్చాడు.ఇటీవలే రెండు జాతీయ ఈవెంట్లు, ఒక టీమ్ రేస్‌లో పాల్గొన్నాడు.

లోరెట్టాస్ అనే ప్రతిష్టాత్మక మోటోక్రాస్ ఈవెంట్‌లో పాల్గొనాలని కలలు కన్నాడు.ఆ కలను సాకారం చేసుకోవడానికి ఒక స్థానిక రేసులో పాల్గొనడానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఈ విషాదం జరిగింది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

మాటియో అవయవ దానం( Organ Donation ) చాలా మంది ప్రాణాలను కాపాడగలదు.అతని ధైర్యం, దయ మనందరికీ స్ఫూర్తిదాయకం.

Advertisement

మాటియో డియాజ్ మరణం తర్వాత, అతని కుటుంబానికి సహాయం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చారు.అతని అంత్యక్రియలు, ప్రయాణం, ఆసుపత్రి బిల్లుల కోసం డబ్బును సేకరించారు.

మాటియో యూఎస్ బీమా ఖర్చులను పూర్తిగా భరించలేదు, కాబట్టి ఈ సహాయం చాలా అవసరమైంది.

ప్రమాదం తర్వాత, మాటియోను మొదట వుడ్‌ల్యాండ్స్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేశారు.తరువాత, మరింత మెరుగైన సంరక్షణ కోసం హ్యూస్టన్‌( Huston )లోని పిల్లల ఆసుపత్రికి తరలించారు.అతని అవయవాలను దానం చేసిన తర్వాత, అతని కుటుంబం అతనిని దహనం చేసి, అతని బూడిదను తిరిగి మెక్సికోకు తీసుకువెళ్లి అతని అమ్మమ్మ పక్కన ఖననం చేసింది.

ఈ కష్ట సమయంలో, మాటియో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం చాలా ముఖ్యమైనది.విరాళాలు వారికి భారీ ఖర్చులను భరించడానికి సహాయం చేశాయి.వారి బాధను తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చాయి.

తాజా వార్తలు