తెలంగాణలో మాస్టర్ ప్లాన్ సెగలు

తెలంగాణలో మాస్టర్ ప్లాన్‎పై రాజుకున్న సెగలు భగ్గుమంటున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్స్ పై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.దీంతో కలెక్టరేట్లు అన్నీ రణరంగంగా మారుతున్నాయి.

మరోవైపు మాస్టర్ ప్లాన్ ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలకు ఆయుధంగా మారిందని చెప్పొచ్చు.రైతులకు పలు పార్టీల నేతల మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

ముందుగా కామారెడ్డిలో ప్రారంభమైన మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు జగిత్యాల జిల్లాలో కూడా విస్తరించాయి.మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు.

Advertisement

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు