పెళ్లి చేసిన చాట్ జీపీటీ.. అతిధులకు వినూత్నంగా వెల్‌కమ్

టెక్నాలజీ( Technology ) ప్రపంచంలో ఇప్పుడు చాట్ జీపీటీ ( Chat GPT )ఒక సంచలనంగా మారింది.చాట్ జీపీటీతో టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.

దీని వల్ల చాలా పనులు సులువు అవుతున్నాయి.ఎన్నో రంగాల్లో చాట్ జీపీటీ కీలక పాత్ర పోషిస్తుంది.

ఎన్నో కష్టతరమైన పనులను చాట్ జీపీటీ సులువుగా చేసేస్తుంది.అంతేకాకుండా ఒక క్లిక్ తో కంటెంట్ కూడా జనరేట్ చేస్తుంది.

దీంతో చాలామంది కంటెంట్ కోసం ఈ టూల్ ని ఉపయోగిస్తున్నారు.చాలా కంపెనీలు ఉద్యోగులకు బదులు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నాయి.

Advertisement

అయితే తాజాగా చాట్ జీపీటీ పెళ్లిళ్లు కూడా చేసింది.ఒక జంటకు పెళ్లి చేసింది.చాట్ జీపీటీ పెళ్లి చేయడం ఏంటని అనుకుంటున్నారా.

అవును.మీరు విన్నది నిజమే.

అమెరికాలోని కొలోరాడోలో ( Colorado, USA )ఈ ఘటన జరిగింది.చాట్ జీపీటీతో ఒక జంట ఒక్కటైంది.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి మధ్య చాట్ జీపీటీతో కనెక్ట్ చేసిన స్పీకర్ పెట్టిన తర్వాత రోబోటిక్ మాస్క్( Robotic mask ) తగిలించారు.ఆ తర్వాత పెళ్లికి వచ్చినవారిని అది ఆహ్వానించింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

పెళ్లి పెద్దగా ఉండి అన్నీ వ్యవహరాలు చక్కదిద్దింది.అందరికీ వెల్ కమ్ చెప్పేసింది.

Advertisement

వాయిస్ యాప్ తో పెళ్లికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించింది.అమెరికాలో పెళ్లి చేసేందుకు ప్రత్యేకంగా అఫీషియెంట్ అనే వ్యక్తులు ఉంటారు.వాళ్ల ద్వారా జరిగితేనే లైనెన్స్ మ్యారేజులుగా పరిగణిస్తారు.

అయితే కాలొరాడో అనే ప్రాంతంలో ఆ నిబంధన లేదని తెలుస్తుంది.అందుకే చాట్ జీపీటీ సాంకేతికతో ఇలా పెళ్లి చేసుకున్నారు.

చాట్ జీపీటీతో చేసిన ఈ ప్రయోగానికి అందరూ ఫిదా అయిపోయారు.అతిథులు పెళ్లికి వచ్చి వెళ్లేటప్పుడు అందరికీ బై చెప్పడం, పెళ్లికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడం లాంటివి కూడా చాట్ జీపీటీ చేసింది.

తాజా వార్తలు