మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి మృతి.?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సాయన్న మృతిచెందారని తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారని సమాచారం.

అయితే రాజిరెడ్డి మృతిని మావోయిస్ట్ పార్టీ ఇంకా ధృవీకరించలేదు.ఛత్తీస్ గఢ్, ఒడిశా దండకారణ్యంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

కాగా ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్త్రులపల్లి.రాజిరెడ్డి పార్టీలో సాయన్న, మీసాల సాయన్న, సత్తెన్న, దేశ్ పాండే వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈక్రమంలోనే రాజిరెడ్డిపై ప్రభుత్వం రూ.కోటి నజరానా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు