Superstar Krishna Manjula : అందుకే నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లారు.. మంజుల షాకింగ్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ మరణించి వారం రోజులు కాగా కృష్ణ అభిమానులలో చాలామందిని ఆయన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.

కృష్ణ మరణం గురించి మరో ఎమోషనల్ పోస్ట్ చేసిన మంజుల ఆ పోస్ట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

అమ్మానాన్నల వివాహ బంధం స్వర్గంలో కూడా కొనసాగేంత గొప్ప బంధం అని మంజుల అన్నారు.అమ్మ మరణం తర్వాత నాన్న అమ్మను చాలా మిస్ అయ్యారని అనుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ కారణం వల్లే నాన్న మమ్మల్ని విడిచి అమ్మ దగ్గరకు చేరాడని మంజుల పోస్ట్ లో పేర్కొన్నారు.అమ్మానాన్న ఆత్మలు సహచరులేనేమో అని మంజుల కామెంట్లు చేశారు.

అమ్మానాన్నల 60 సంవత్సరాల అనుబంధానికి ఐదుగురు పిల్లలం అని ఆమె చెప్పుకొచ్చారు.అమ్మానాన్న లాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లీదండ్రులు కావడం నా లక్ అని మంజుల అన్నారు.

Advertisement

అమ్మానాన్నల ప్రేమ మాకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంజుల చెప్పుకొచ్చారు.అమ్మానాన్నలలో కనీసం పది శాతమైనా స్వచ్చంగా మారడమే వారికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నానని మంజుల కామెంట్లు చేశారు.

అమ్మానాన్నలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అని ఆమె అన్నారు.ఇందిరా దేవి, విజయనిర్మల మధ్య ఏ స్థాయిలో అనుబంధం ఉందో ఈ పోస్ట్ ద్వారా సులువుగానే అర్థమవుతుంది.

కృష్ణ మరణించినా అభిమానుల హృదయాల్లో ఆయన జీవించి ఉన్నారు.

మరోవైపు కృష్ణ మరణం తర్వాత వైరల్ అవుతున్న పలు వార్తలు మహేష్ బాబును బాధ పెడుతున్నాయని తెలుస్తోంది.తప్పుగా ప్రచారంలోకి వస్తున్న వార్తల గురించి స్పందించడానికి కూడా మహేష్ బాబు ఇష్టపడటం లేదు.మహేష్ ను హర్ట్ చేసే వార్తలను ప్రచారంలోకి తీసుకురావద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

కృష్ణ కూతురు మంజుల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు