మనీశ్ సిసోడియా ఈడీ అరెస్ట్ రిమాండ్‎పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు సిసోడియా ఈడీ అరెస్ట్ రిమాండ్ అప్లికేషన్ పై కోర్టులో విచారణ జరిగింది.

ఈ క్రమంలోనే రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియాపై ఈడీ అభియోగాలు వెల్లడించింది.మద్యం హోల్ సేల్ వ్యాపారం కొందరికి మాత్రమే దక్కేలా కుట్రపూరితంగా మద్యం పాలసీని రూపొందించి, అమలు చేశారని అధికారులు కోర్టుకు తెలిపారు.

డీలర్ కమిషన్ ను 12 శాతంగా నిర్ణయించాలని ప్రజలు సూచించలేదని చెప్పారు.గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఎక్కడా దీని గురించి చర్చించలేదని పేర్కొన్నారు.

సమావేశం మినట్స్ ఎక్కడా రికార్డు చేయలేదని తెలిపారు.ఈ మొత్తం కుట్రలో విజయ్ నాయర్, సౌత్ గ్రూపులో మరికొందరు కలిసి కోఆర్డినేట్ చేశారని వెల్లడించారు.

Advertisement

హోల్ సేల్ వ్యాపారులకు అసాధారణ లాభాలు వచ్చేలా ప్లాన్ చేశారన్నారు.మనీశ్ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement