ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న సినిమా సీక్వెల్‌ ను జనాలు పట్టించుకోవడం లేదు పాపం

తమిళ స్టార్‌ దర్శకుడు మణిరత్నం( Mani Ratnam ) డ్రీమ్ ప్రాజెక్ట్‌ గా వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌( Ponnian Selvan) గత ఏడాది విడుదల అయిన సినిమాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే.

పొన్నియన్ సెల్వన్‌ చిత్రం కు వెంటనే సీక్వెల్‌ ను కూడా తీసుకు రాబోతున్నారు.

తమిళనాట ఇండస్ట్రీ హిట్‌ సొంతం చేసుకున్న ఆ సినిమాకు సీక్వెల్‌ రెడీ అవ్వడంతో పాటు విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది.తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పొన్నియన్ సెల్వన్‌ ను తెలుగు లో మాత్రం బయ్యర్స్ పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు లో ఈ సినిమాను తమిళ మేకర్స్ నేరుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.పొన్నియన్‌ సెల్వన్‌ పూర్తిగా తమిళ సినిమా అని.తమిళ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా కు తమిళనాట కాకుండా బయట అస్సలు బిజినెస్ జరగడం లేదనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

మరో వైపు పొన్నియన్‌ సెల్వన్‌ మేకర్స్ మాత్రం సినిమా పై నమ్మకంతో సొంతంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ ప్రకటించారు.అన్ని భాషల్లో పీఎస్‌ 1 ( PS 1)కంటే కూడా అధికంగా ఆధరణ దక్కించుకునే విధంగా పీఎస్ 2 సినిమా ఉంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఐశ్వర్య రాయ్ పాత్ర సినిమా లో మరింత కీలకంగా ఉంటుందని ఈసారి ఆమె నుండి మరింతగా కంటెంట్‌ ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement