మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. వైరల్ అవుతున్న నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ( Meena) గురించి మనందరికీ తెలిసిందే.

ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మీనా.

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా తమిళ,మలయాళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఈమె దాదాపు 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది.

తన పని ఏదో తాను చేసుకుంటూ కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటుంది మీనా.అలాంటిది ఒక నిర్మాత ( producer )మీనా ఆమె తల్లిదండ్రులను అవమానించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ నిర్మాత మారెవరో కాదు మాణిక్యం నారాయణన్‌( Manikyam Narayanan ).తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.ఒక ప్రోగ్రామ్‌ చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను.

Advertisement

కానీ అటు వైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు.మీనా నే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు.

నేనొక నిర్మాతను నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది.అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్‌గా మాట్లాడతారా? నాకు చాలా బాధేసింది.ఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని తెలిసొచ్చింది.

సౌత్‌ ఇండస్ట్రీలో ఖుష్బూ, రోజా, సుహాసిని ఇలా చాలామంది సూపర్‌ హీరోయిన్లు నాకు స్నేహితులే.వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు.అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్‌ ఉండటమే నయం అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలపై మీనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
Advertisement

తాజా వార్తలు