‘అఖిల్‌’ను ఫాలో అవుతున్న ‘డిక్టేటర్‌’

అక్కినేని హీరో అఖిల్‌ నటించిన ‘అఖిల్‌’ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ మరియు తమన్‌లు సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే.

వీరిద్దరితో పాటు మణిశర్మ ‘అఖిల్‌’ సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ను అందించాడు.

బ్యాక్‌ గ్రౌండ్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ‘అఖిల్‌’ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యింది.ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను అందించిన సంగీత దర్శకుడు మణిశర్మ మరో సినిమాకు ప్రత్యేకంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను అందించబోతున్నాడు.

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్టేటర్‌’ చిత్రానికి మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను అందించబోతున్నాడు.ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

అయితే తమన్‌ కంటే కూడా మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌కే బాలయ్య ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ‘డిక్టేటర్‌’కు మణిశర్మతో నేపథ్య సంగీతాన్ని చేయిస్తున్నారు.

Advertisement

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అంజలి మరియు సొనాల్‌ చౌహాన్‌లు నటించిన విషయం తెల్సిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement