జగన్‌ రెడ్డి.. ఆ ఇద్దరు రెడ్లను ఎన్‌కౌంటర్‌ చేయమని చెప్పు చూద్దాం.. మందకృష్ణ సవాల్‌!

దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని సమర్థించిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.

ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్‌కౌంటర్‌ చేస్తే సమర్థించారు.

మరి నలుగురు మహిళలను చంపిన రెడ్డికి ఇదే శిక్ష వేయమని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిని.

జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై హత్యాచారం చేసిన నవీన్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని చెప్పే సాహసం జగన్‌ చేయగలరా అంటూ మందకృష్ణ ప్రశ్నించడం గమనార్హం.అసెంబ్లీ సాక్షిగా ఎన్‌కౌంటర్‌ను జగన్‌ సమర్థించడం ఏంటని ఆయన మండిపడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సామాజికవర్గాల వారికి అన్యాయం జరిగినపుడే స్పందిస్తున్నారని, అదే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.అంతేకాదు ఆర్థిక నేరగాళ్లపై వెంటనే న్యాయ విచారణ జరిపే చట్టాన్ని జగన్‌ తీసుకురాగలరా అని కూడా మందకృష్ణ ప్రశ్నించారు.

Advertisement
ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి

తాజా వార్తలు