కన్నప్ప మూవీకి ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్లు ఇవే.. మంచు విష్ణు ఏమన్నారంటే?

మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప మూవీ( Kannappa movie ) నుంచి తాజాగా శివ శివ శంకర సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ఏకంగా 6.

5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.టీ సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో ఈ సాంగ్ అందుబాటులో ఉంది.

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ సాంగ్ వినిపిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.కన్నప్ప సినిమాలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement
Manchu Vishnu Comments About Remunerations Details Inside Goes Viral In Social M

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్( Prabhas, Akshay Kumar, Mohanlal ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటం గమనార్హం.కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపిస్తారని మంచు విష్ణు వెల్లడించారు.

Manchu Vishnu Comments About Remunerations Details Inside Goes Viral In Social M

అక్షయ్ కుమార్ ను ఈ సినిమాలోని రోల్ కోసం సంప్రదించిన సమయంలో ఆయన తిరస్కరించారని మంచు విష్ణు అన్నారు.ఆ తర్వాత వేరే డైరెక్టర్ తో చెప్పించి అక్షయ్ కుమార్ ను ఒప్పించామని విష్ణు తెలిపారు.ఈ తరానికి మీరే శివుడు అని అక్షయ్ కుమార్ తో చెప్పానని మంచు విష్ణు కామెంట్లు చేశారు.

ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారని వాళ్లు కథ చెప్పగానే అంగీకరించారని విష్ణు పేర్కొన్నారు.

Manchu Vishnu Comments About Remunerations Details Inside Goes Viral In Social M

ఈ సినిమా కోసం ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదని విష్ణు చెప్పుకొచ్చారు.ప్రభాస్ వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగిందని విష్ణు వెల్లడించారు.సాధారణంగా ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

స్టార్ హీరో ప్రభాస్ తర్వాత సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు